తే. భారతీయ భాషల మాతృభాష సంస్కృ
తమ్ము శ్రద్ధతో నేర్వఁగాఁ దాని దేశ
భద్రతయు, నైకమత్యమ్ము, పరమసుసమ
గ్రతయును పటిష్ఠములగును - కనుడు - దీని.
తే. గెలుపు, ఓటమి మన హస్తములను లేవు!
చేయవలసినదేదైన చేయఁజాలు!
ఔను మన పని చేత ముఖ్యమ్ము మనకు
కలుగు ఫలితము సర్వేశుకాంక్ష కరణి. -మహాత్మా గాంధీ
తే. అర్ధమే ముఖ్యముగ సాగినట్టి కైతఁ
గనులతోఁ జూచి తెలియఁగాఁ గడఁగ వచ్చు
కైత శబ్దార్థ సంయోగ ఘటనఁ గలిగి
యున్న గొంతెత్తి చదువుట యుత్తమంబు.
తే. అధికవీరులు “తార్తారు” లట్టి మాట
కరయ "యమ కింకరావళి” యుద్ధ మట్టి
దాని నేల నా చింఘీసుఖాను తనదు
ననుచరులు పేరుగాఁ బెట్టననుమతించె?
తే. క్రొత్త వృత్తుల తోచ గైకొనఁగ వాని
నవసరమ్మగు నెన్నియో మన్యగతులు
వానిగైకొన తప్పదు గాన మనము
త్రోసి వేయంగవలెఁ గొన్ని తొంటి వాని.
తే. నాదుపేరు స్మరింపుము, నన్నె శరణు
పొందు - మయిన నే నెవరనో పోల్చుకొనఁగ
శ్రవణ, మననములొందుము రహితరూపు
డను, సకలమున నుండువాఁడను గ్రహించు.-షిర్డీ సాయిబాబా
తే. ధ్యాన, మారాధ్యము, - పెట్టెయందుఁ బెట్టి
తాళమును వేయుకొఱకు నెంతయును స్వర్ణ
హారముల వంటి నగలు కావవ్వి, మనము
చేయు ప్రతికృత్యమందు విచ్చేయ వలయు.-మహాత్మా గాంధీ
258
వావిలాల సోమయాజులు సాహిత్యం-1