Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. పరమ భూరేణువులఁ గల్గెఁ బర్వతమ్ము
    దొడ్డ దౌ నబ్ది నీరబిందువులఁ గలిగె
    అటులె యున్నది జీవిత మధిక సంఖ్య
    చేష్టలను, నిత్యవచనాల, చింత నలను. - స్వామి శివానంద

తే. ఎల్లవారి క్షేమమ్ము కాంక్షింపు మీవు
    అందువలనను పెరుగు నీ ఆయు వెంతొ
    పెద్ద శాంతి సౌఖ్యమ్ము లభించు నీకు
    తలఁచు మిద్దాని నెంతొ సత్యమ్ము గాన.- స్వామి శివానంద

తే. పాప కృత్యాల మనము గుప్తముగఁ జేతు
    మయిన మన చేతలనె గాక నఖిలమైన
    యట్టి మన యూహలను గనునా మహేశుఁ
    డట్లు గ్రహియించు వేళను నబ్బు ముక్తి.- మహాత్మా గాంధీ

తే. కడఁగి డ్రింకెట్టు జాతినాగమ్ము కష్ట
    పడి మహారాష్ట్ర కచనూరు కడకుఁ జేరి
    యొక దుకాణమ్ము గైకొని యొప్పునట్టి
    యాశ్రయమ్మున బిడ్డకు నమ్మ యయ్యె.వార్త

తే. ఎవ్వఁ డీయిల సర్వమ్ము నెరుఁగు వాని
    వలన నెయ్యదియును పోదు వాఁడు నన్ను
    నేదిగా భావనము జేయు నేను నటులె
    వానికిని, ప్రతివానికిని గానఁబడుదు.- మెహర్ బాబా

తే. పరగ నెవడాత్మ హృదయదేవాలయముల
    లోఁ బ్రవేశించి యంత మహాప్రభావుఁ
    డయిన భగవంతుఁ జూడని యట్టి వారె
    నిజముగ నదృశ్యు లియ్యిల నిజము, నిజము!- మెహర్ బాబా

తే. నామమును, కీర్తి, సంపద నాశమైన
    దైవమార్గమ్ము విడవఁగాఁ దలఁపరాదు
    చెదరకను మీరు గమ్యము చేరువరకు
    ననుసరింపుఁడు దాని నత్యంత దీక్ష.-స్వామి వివేకానంద


మధుప్రప

255