Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. కలిగి యందు వచ్చు సుర వృక్షమ్ము నుండి,
    సీధువు మధు ప్రసవ తతిఁ జేరి కలుగు
    కోసి పండ్లు తీయఁబడు ఫలాసవమ్ము
    వీని భేదమ్ము నెఱిఁగి సేవింపవలయు.

తే. కఱ్ఱతోఁ గొట్టి చంపంగఁ గష్టపడుట
   త్రోవఁబోవు మౌనియెకని తొలఁగి పలికె
    "పాపమౌఁ జెప్ప తిరగేసి పయినఁ బోయు
    వేడినీళ్ళకు తాఁబేలు విడుచు బ్రతుకు.”

తే. మున్ను జీవకుఁడనెడి విద్వన్నుతుండు
    తక్షశిల నేర్చినట్టి వైద్యాంతమందు
    “కన ననౌషధమెద్దియుఁ గానఁ బడదు”
    అనడె తెమ్మని గురుఁడంప నరిగి వచ్చి.

తే. సలుప 'ఆదాము' కొనె బహిష్కరణ హవ్వ
    అపుడె సైతాను గావించెనట్టి పనిని
    దాని దేవుని వలన నాదాము కొనియె
    కాని యవమానపడె జ్ఞాన కారణమున.

తే. మనకు దూరాన నున్న యామాన్యలోక
    మరయ సన్యాసి చూచు గవాక్షమరయ
    ఆగవాక్షము ననుఁ జూచు నఖిల దర్శ
    నమ్ము జనియించు నతని మనస్సు నందు.

తే. ఎవఁడు దాసుండు ధనమున కెప్పుడు గాడొ
    ధనము గావించు నెవనికి దాస్య మెపుడు
    అతఁడు నిజమైన మానవుఁ డనుచుఁ దెలియఁ
    బలుకఁగా లేదె మనకు నా పరమహంస.

తే. బ్రతుకు నొకయొడ్డు పట్టించు ప్రౌఢిమమ్ము
    నార్జనము చేయు బ్రహ్మ చర్యమున నెవఁడు
    అతఁడి భావి జీవితము భయరహితమ్ము
    సర్వశుభపూరితమ్మయి సాగుచుండు.


మధుప్రప

249