తే. ఇతరులెపుడైన నెటనైన నే మొనర్ప
గలుగగా వ్యథ తనమది కష్టపడునొ
దాని నితరులు కొనరింపఁ దలఁపకుంట
ధర్మములలోన నుత్తమ ధర్మమరయ. - వ్యాసభారతము
తే. గ్రీసుదేశమ్ము నేలు నగ్రేసరుండు
మణులఁ జూపింపుఁ డనుచు రమణులఁ బిల్వ
తల్లి కోర్నలియా చూపి పిల్లవాండ్రు
“ఇవియె నా మణు”లని వచియించెఁ బ్రీతి.
తే. శ్రోత్రియుని భార్య, నృపసతి, మిత్రు పత్ని,
మామ పెండ్లాము, ఆచార్య మహిళ, గురుని
వనిత ఈ అపాత్రముల నెవ్వతను గాను
నను నిషేధించు టిది యేమి న్యాయ మయ్య?
తే. ఒకరు సంపదలను గల్గియున్న యపుడు
వారిఁ జేరి సహకరించువారి కంటె
నాపదలు కల్గు సమయాలు నాదుకొనెడి
వారె నిజమైన స్నేహితుల్ వాస్తవముగ. - పంచతంత్రము
తే. కర్మ ఫలితాల యనుభవగమనమునకు
లేదు తప్పించుకొను మార్గమేది యైనఁ
గాన జీవులెల్లరును సత్కర్మచయమె
చేయవలెనని బుద్ధుండు చెప్పలేదె?
తే. యజ్ఞమందలి కర్మగా కన్యయైన
కర్మమంతయు బంధన కారణమ్ము
స్వార్ధరహితమ్ముగాఁ జేయు సర్వకర్మ!
భగవదర్పితమై మోక్షపథ మొసంగు.
తే. మానవుఁడు తనకున్న సంపదను దనదు
'స్వంత' మైనట్లుగాఁ గాక సర్వజనుల
దైనయట్లుగ భావించి యవసరమ్ము
నొందు వారి కుంచఁవలెం బొందునట్లు. -థామస్ ఎక్కినస్
మధుప్రప
245