తే. ఎటులఁ దలపోయు చుందుమో యటు లొనర్ప
నెంత మాత్రము మనచేత నేమియుండ
దాయదృష్టము త్రిప్పుచు నటుల నిటుల
జరుగవలసిన దానిని జరుపుచుండు.
తే. ఎప్పటికి నట్టె భృత్యుల కీయవలయు
జీత, మాహారధాన్యాలు చెప్పినటుల
అయిన నాలస్య మా ప్రభునైన నాగ్ర
హించి దూషింత్రు వారది యెంతొ ముప్పు.
తే. ఈ జగమ్మును మరి జనియించె నట్టి
సకల జనులందుఁ బ్రతివారి కొకటి తల్లి
తండ్రియును నుపాధ్యాయుండు తప్ప కెపుడు
మువ్వురు గురువు లవుచును బూజఁగొండ్రు.
తే. కన నిరుత్సాహవంతుండు గానివాఁడె
యరసి ప్రారంభమొనరించు నన్నిపనులు
చెలగి యుత్సాహమే యిల జీవిసేయు
సర్వకృత్యాల నొనరించు సఫలములుగ.
తే. కోపమును గొన్న మనుజుండు పాపకృత్య
మొనరఁ గావింపకుండునే - ఒడిసి చంపు
గురువులను, సాధుజనులను పరుష వాక్య
ములను నెదురించుటయుఁ జేయు మూర్ఖుఁడగుచు.
తే. అగు స్వభావమ్ము మార్చుటత్యంత మౌన
సాధ్య కృత్యమ్ము మంచి నే సమయమందు
నెట్టి హేతువున గ్రహించి రేని దుష్టుఁ
డద్ది బహుకాల ముండఁబో దచట నిలచి. 12
తే. గర్వమను నంధకారానఁ గడఁగి తెలుసు
కొనగ మంచి చెడ్డలు క్రూరు లెంత
దొడ్డవారైన సరియైన త్రోవఁ జేరుఁ
డనుచు శాసించుటగును న్యాయమ్ము, నిజము!
228
వావిలాల సోమయాజులు సాహిత్యం-1