Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'వాల్మీకి రామాయణ నీతి శ్లోకానువాదములు '


తే. అర్థి నుపకార మొనరించి నట్టి మిత్ర
    తతి కసత్యప్రతిజ్ఞలఁ దానె పూని
    యెవఁ డధర్మము గావించు నిచ్చ మెయిని
    నతని మించెడి ఘన నీచుడరయ లేడు.

తే. ఆ నిరుత్సాహవంతుఁడే యన్ని పనులఁ
    గడగి యారంభమొనరింపఁ గలఁడు, జీవి
    జగతిఁ గావించు నట్టిదౌ సకల కృషిని,
    సఫల మొనరించు సత్య, ముత్సాహమెపుడు.

తే. పూర్వజనపాలనమ్ము సంపూర్ణ సత్య
    కరుణల పయిన నిలచియె గడచుచుండె
    అఖిల లోకమ్ము నిలచి సత్యమ్ము పైన
    నుంట సత్యమ్ముపై నిల్చియుండు ప్రభుత!

తే. ఇలను పాపిష్ఠి పనులు గావించువాఁడు
    ఎట్టి మర్యాదమైన లేనట్టివాఁడు
    చెప్పునది చేయకుండువాఁ డెప్పుడయిన
    గైకొనగ లేఁడు సజ్జన గౌరవుఁడుగ.

తే. ఎపుడు వచ్చును నీతోడ మృతి విడువక
    నీ సమక్షాన కూర్చుండు నిశలు పవలు
    ఎంత నడువ తా వెంటనె యంతయుండు
    తిరిగి వచ్చెడి యానానఁ దిరిగి వచ్చు.

తే. మిద్దెలైనను వసియించు మేడలయిన
    నందముల నొప్పు చీని చీనాంబరములు
    రాజసత్కార, ప్రాకార లక్షణములు
    తరుణులకు నౌనె గౌరవావరణ చయము?
    చాన సౌశీల్యమౌ మహాచ్ఛాదనమ్ము. 6


మధుప్రప

227