Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ప్రభువు దోషుల శిక్షింపవలయు - అటుల
    శిక్షణను నిచ్చుటెంతయు క్షేమకరము
    నుత్తమ మ్మగు కార్యమైయుంటవలన
    జనపతి తప్పక వెడలును స్వర్గమునకు.244

తే. చెప్పినది పిన్నలైనను క్షేమమొసగు
    నట్టి వాక్యమ్ముగ్రహియింపనగును - కాన
    సర్వమయినది యుక్తమ్మునయిన నీదు
    నుచిత వాక్యము వినుచుంటి నోయి భరత!245


226

వావిలాల సోమయాజులు సాహిత్యం-1