Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


    కులము మూడు కులమ్ముల నిలుపు కన్య
    సర్వ విషయాల సంశయ స్థానమందు.237

తే. రాక్షసాధిప! నేను నిరాకరింప
    బడితి నెపుడును నీచేత - పరమదోషి
    యయ్యు బాలుఁ డెవ్వేళను నగును గాదె
    బంధువులకు రక్షింపఁగా వలయు వాఁడు.238

తే. ఇలను నేజీవి యపకీర్తి యెంతవరకుఁ
    జర్చనీయాంశ మైయుండి సాగుచుండు
    నట్లు చర్చసాగెడు సమయమ్ము వఱకు
    నధమలోకమ్ము నందు నాతఁడుండు.239

తే. తృప్తి గలిగింప దపకీర్తి దేవతలకు
    మెచ్చెదరు కీర్తి లోకాల మెలగువారు
    రక్తిని మహాత్ములెవో కార్యములను
    గెరలి మొదలు పెట్టుటయును గీర్తి కొఱకె.240

తే. భర్త దేవత, భర్తయౌ బాంధవుండు,
    భర్త గురుఁడు అందువలనఁ బ్రాణములను
    నర్పణము చేసి యైనను నతని కిష్ట
    మైన కార్యమ్ము గావించు టవసరమ్ము.241

తే. ఎవడు విధిక్రమమ్మునను పాలింపఁ డట్టి
    రాజొనర్చెడి దోషాల ప్రజలు నాశ
    నమ్ము గొనెదరు - రాజు దుర్నయత నేల
    జనులు మరణింత్రు వార్ధక్యమునకు మున్నె.242

తే. పురములందున గ్రామాలఁ బొలుచు ప్రజలు
    చేయఁగా రాని పనులను జేయుచుండ
    రాజరక్షణ లేనట్టి రాజ్యమందుఁ
    గలుగు మరణ భయమ్ము దుష్కాలమునను.243


మధుప్రప

225