తే. శుభములొనరించు నాతండు సుఖములొందు
పాపములు చేయువాఁడొందు పాపచయము
పేరి సౌఖ్యాల నొందు విభీషణుండు
రాక్షసుఁడు రావణునకు మరణము ఫలము. 231
తే. వ్యసనములను, కృచ్ఛముల, యుద్ధాదులందు,
యజ్ఞముల, స్వయంవరముల నంత పాణి
గ్రహణ విరహాల పరులకు గ్రందుఁబడుట
కాంతలకు దోషమెన్నండు కాదు, కాదు.232
తే. చరిత సందేహమును గొన్న చానవైన
నీవు ప్రత్యక్షమున నిష్టు నిలిచినావు.
నేత్రరోగి నిర్మలిన సందీపకాంతి
నెట్లో యటులనే నిన్ను సహింపఁజాల!233
తే. చేయవలసిన పని పూర్తి చేసి పిదప
నడ్డు కలుగకయుంటకై యందు కొఱకు
నన్యకార్యమ్ము లెవఁడు తానాచరించు
నతఁడె యర్హుఁడు సకల కార్యము లొనర్ప.234
తే. అఖిల లోకాన పని యల్పమైనదైన
నొక్క మార్గాన సాధింపనోప లేము
కార్యసాధన కెవ్వాఁడు కనుఁగొనంగఁ
జాలు సాధనల నతఁడు సాధకుండు.235
తే. కన్నెలకుఁ బితృత్వము దుఃఖ కారణమ్ము
అంద రభిమానవంతులు కగును గాదె
ఎవఁడు వరియించునో యన్న దెఱుక పడక,
నోర్చుకొనలేక తా వ్యథ నొందు చుండ.236
తే. తల్లి పుట్టిన కులమును, తండ్రి కులము,
నామె యీయంగఁ బడియెడి యట్టివాని
224
వావిలాల సోమయాజులు సాహిత్యం-1