Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ప్రేరితము, వినాశము సమీపించినపుడు
    ఈశ్వరేచ్ఛకు లోఁబడి యెంత వారు
    తా మొనర్చెడి పనులందుఁ దప్పిదముల
    నాచరించుచు నుందు రత్యధిక ముగను.114

తే. లక్ష్మణా! పశు పక్షుల లక్షణమున
    నైన సాధు స్వభావమ్ము నధికధర్మ
    కార్యకరణ వీరములు రక్షణమ్ము
    లున్నయట్టులఁ గన్పించుచున్నవోయి.115

కిష్కింధా కాండము


తే. ఎట్టి జాతికి జెందిన యట్టి జీవి
    అట్టి జాతిని వెదకిన నందు దొరకు
    ఇతర జాతుల దొరుకదు అతివ అతివ
    లందు దొరకును మృగములయందు కాదు.116

తే. సర్వ మీయ పెంపునకు నుత్సాహముగను
    మూలమైనది కాన నే మున్ను సీత
    వెదకు తావుల నెట శ్రద్ధ వీక్షణమ్ము
    చేయగా లేదో, శ్రద్ధతో చేయువాడ.117

తే. ఎవ డనిర్వేదు డోయత డెల్ల వేళ
    లందు కర్మల ప్రారంభ మాచరించు
    ఇట్టి ఉత్సాహ మే జీవి యెట్టి కర్మ
    చేయు దానిని సఫలమ్ము జేయునెపుడు.118

తే. ఆత్మ నాశనమున గల్గు నట్టి దోష
    చయ మనంతము, జీవన సలుపువాడు
    పడయు శుభముల కావున ప్రాణములను
    నిల్పుకొని పొందు ధ్రువముగా నిఖిల శుభము.119

తే. నవ్య శోభ నొసగు భూషణమ్ము కంటె
    కోమలికి కాంతి నెంతయో కూర్చు భర్త


మధుప్రప

207