Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. కఱ్ఱ యొక్కటి మఱియొక కఱ్ఱతోడఁ
    గడలి యాదృచ్ఛికమ్ముగాఁ గలిసి కొంత
    కాలమునకు విడివడును - కాంత, సుతుఁడు
    బంధువుల్, సంపదల్ కూడి పాయు నిట్లె.67

తే. పుత్రి, యుక్తవయసును బొందియుంట
    తండ్రి కెంతయో యౌను బాధాకరమ్ము
    ఇంద్రునంతటి వాఁడైన నెదియొ పల్కి
    నిందఁ గావింత్రుఁ పిన్నలు న్పెద్దవారు.68

అరణ్య కాండము


తే. ధర్మపాలుఁడు, కాననస్థానమందు
    బ్రతుకు నీతపోమహనీయ రక్షకుండు,
    ఖ్యాతి యుతుఁడు పూజార్హత గల్గువాఁడు
    దండిరాజు, అత్యధికుఁ డందఱిని మించి.69

తే. ఇంద్రు నంశతోడ నవతరించి నట్టి
   వాఁడు ప్రజల రక్షించెడివాఁడు, రాజు
   అందుచే నతఁడు జగము నంతలోని
   యఖిల భోగమ్ము, లందమ్ము ననుభవించు.70

తే. ప్రజల యాదాయమున నారవదగు నట్టి
    భాగమును పన్నుగాఁ గొని, ప్రజలఁ బిల్ల
    లవలెఁ బాలింప నట్టి ప్రభువుకుఁ గల్గు
    దొడ్డ దాన ధర్మము నిస్తులము నిజము.71

తే. కందమూల ఫలాల భక్షణముతోడ
    మునులొనర్చు ధార్మిక కృత్యములను నాల్గ
    వది యయిన వంతు చెందును బ్రజల ధార్మి
    కముగ రక్షించు రాజు నక్షయముగాను.72


200

వావిలాల సోమయాజులు సాహిత్యం-1