తే. మంచి చెడులను విభజించి, మంచి నెపుడు
ప్రోత్సహించుచు, చెడులను రూపుమాపి
రాజ్యపాలన మొనరించు రాజు లేక
యఖిల మొకటియె యౌచు నాంధ్యము గ్రమ్ము.60
తే. తమదు పరివారడంబరత్వముల నుండి
రాజులును, రాజపుత్రులు రాజ్యమందుఁ
గల తపోధనుల కెపుడుఁ గార్యభంగ
మొనకుండఁగ దూరాన నుంచవలయు.61
తే. బంధు మిత్రులు నాశమ్ము బడయ సంక్ర
మించు ధనమును నే స్వీకరించనెపుడు
నాధన మ్మది విషకృతమైన భోజ
నంపు వస్తువులను బోలు సొంపు తరిగి.62
తే. కష్టపడి కూడఁబెట్టిన కనకరాశు
లవును తుదినాశనమ్ము సురాధిపత్య
మైననట్లే భార్యా కుమారాదులట్లే
అట్లె జీవితము మృతిని అంతమందు.63
తే. పండిన ఫలములనుకును దప్పకయె క్రింద
పడు ప్రమాదమ్ము కల్గు నే ప్రాంతమైన
అటులె యావిధిఁబుట్టిన యట్టి మాన
వాళి కగుఁగీడు గిట్టుట యఖిల దిశల.64
తే. గాఢ శిలలతో గట్టిగాఁ గట్టఁ బడియుఁ
గాలగమనాన శిథిలమౌ కట్టడమ్ము
అటులనే జరామరణ వశులై జనాళి
యెట్టి పోషణఁ గొన్న నశింత్రు నిజము.65
తే. సూర్యు ముదయాస్త మయములఁ జూసి జనులు
ఎల్ల దినములఁ గడు సంతసించుచుంద్రు
ఎరుఁగ రీకార్య పద్ధతి క్షయము నొందు
చున్నయది జీవితమ్మను చొప్పువారు.66
మధుప్రప
199