తే. అద్ది దైత్యమునకు లోప మాచరించు,
అద్ది విద్యకు నాశన మాచరించు,
సర్వమునకాచరించు నాశమ్ము నిద్ది,
దుఃఖమును బోలు శత్రువు తోఁచడెపుడు.53
తే. వైరి వలనను బొందిన ప్రబల ఘాత
యోర్చుకొన శక్యమైనదై యుండుఁ కాని
పైనఁ బడినట్టి శోకమ్ముఁ బాపుకొనఁగఁ
గాదు శక్యమ్ము కనఁగ నే కాలమందు.54
తే. ఆమ్ర వని ఛేదన మొనర్చి యట పలాశ
వనము పెంచి కనుచుసుమ వర్ణములను
నెవ్వఁడు దురాశ పండ్ల నాశించు నట్టి
యతఁడు ఆశ కోల్పోవు నిత్యమ్ము, నిజము.55
తే. కర్మలారంభ మొనరించు కాలమందు
నెవ్వ డవ్వాని కఠినతా హీనతలను,
వాని ఫలితాల, శుభముల, నశుభములను
నెఱుఁగడో వాఁడు బాలుఁ డం చెఱుఁగఁబడును.56
తే. ఎట్టి ఫలితమ్ము కలుగునో యేమొ యనుచు
విషయ మెఱుఁగక పని మొదల్పెట్టు వాఁడు
ఫలము నొందెడు సమయాన బాధపడును
కింశుక సేచకుని పగిది.57
తే. గడ్డి బాగుగ మొలవని కాననమ్ము
జలము ప్రవహింపనట్టి శుష్క స్రవంతి
గోప జనములు లేనట్టి గోచయమ్ము
అవును రాజు లేనట్టి రాజ్యమ్ము నిజము!58
తే. రాజు సత్య స్వరూపుండు, రమ్యధర్మ
మూర్తి, యుత్తమ కులజుల ముఖ్యు డతఁడె
తల్లియును దండ్రి, ప్రజలకు, నెల్లజనుల
పరమ సంక్షేమమును జూచువాఁడు రాజు.59
198
వావిలాల సోమయాజులు సాహిత్యం-1