తే. అఖిలలోకాన దుష్టలైనట్టి స్త్రీలు
సతతమును బ్రియులైన తమ పతుల చేతఁ
జూడఁబడినవారైనను చొరగ కష్ట
ములు పతుల లెక్క సేయరు చులకనగను. 46
తే. బహు సుఖమ్ముల నొందియు భర్తవలన
నతఁడు రోగి దరిద్రుఁడు నైన యపుడు
అతని దూషింత్రు, విడుతురు - ఔను ఇద్ది
స్త్రీల నైజమ్ము సర్వ ధాత్రీతలాన.47
తే. వర్తనమ్మున సత్య సంభాషణమున
గురుజనోపదేశమ్మున పరమశాంత
లక్షణమ్మున నున్న సులక్షణలకు
పరమ ముఖ్యుడు లోకాన భర్తయగును.48
తే. తీగలేనట్టి వీణ ధ్వనింపనటుల,
చక్రరహితమ్ము, రథము తా సాగనటుల
ఆత్మజుల నూరుగురిఁ గల్గి నట్టి దైన
భర్త లేని నెలత వృద్ధి వడయ దెపుడు.49
తే. ఇహ సుఖమ్ములఁ గొంతగా నింతి కిచ్చు
వారు తండ్రి, అన్న, సుతుఁడు, భర్త అటుల
కాక నిహపరాలైన సుఖమ్ము లపరిమి
తముగ నిచ్చు భర్త సతి ప్రార్థన మొనర్చు.50
తే. రాము దశరథు నట్టు లారమణి సీత
నన్నుగ గ్రహియింపుము మీర లుండు నటవి
మౌనయోధ్య తండ్రి సుఖాన నరుగు మయ్య
అన్నతోఁగూడి వసియింప నడవియందు.51
తే. ఎవడనుగ్రహమును జూపు నిచ్చ గలుగు
నట్టి ధీయుత భర్తయో అతని చేత
ప్రార్థనము నొంది యద్ధానిఁ బడయనిచ్చు
పడతి యిహపర సుఖములఁ బడయదెపుడు.52
మధుప్రప
197