Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'రామాయణ పద్యాలు

బాలకాండము


తే. బ్రహ్మ రాక్షస పండితుల్ ప్రబలు లగుచు
    యజ్ఞ కర్మాప రాధమ్ములరయుచుంద్రు
    శాస్త్రలోపాన యజ్ఞమ్ము సలుపఁ బడిన
    నమితవేగాన నశియించు యజ్ఞకర్త. 1

తే. యజ్ఞ సాహాయ్య మొనరింతు ననుచుఁ బలికి
    యడుగు వెనుకాడుచుంటివి అట్లొనర్ప
    భంగమౌను ఇష్తాపూర్తఫలము లెల్ల
    కనుక రాముని విడువఁగాఁ గడగు మీవు.2

తే. స్త్రీని హింసింపవలసిన స్థితి జనించె
    నని ఘృణవహించుటెంతొ యన్యాయమయ్య
    ఇది యగుట చాతుర్వర్ణ్య హితము నిష్ఠఁ
    గడఁగి చేయుము కర్తవ్య కార్యమీవు.3

తే. రక్షకుని విధియౌ ప్రజారక్షణమ్ము
    అందుకై పాపకృత్యాల నాచరింప
    వలసివచ్చినఁ గావింప వచ్చు వాని
    రాజ్యభారుల కిద్ది ధర్మమ్ము సతము.4

తే. శోభ నిడు నోర్మి స్త్రీ పురుషులకు,
    కష్ట సాధ్యమ్ము ఓర్మిని గలిగియుంట
    దేవతలయందు నెంతయో తీవ్రతరము
    ఓర్మి నొందుట కష్టమ్ము నొందియుంట.5


190

వావిలాల సోమయాజులు సాహిత్యం-1