తే. క్రొత్తక్రొత్తల చేష్టల గుస్తరించు
ప్రాణికోటుల యనురాగ పథములందు
వింత వెల్గుల జూపించి వెలయు నీవు
కేవలము రతి రాజునే గ్రీష్మ రాజ!
నిన్ను లోకం నిందిస్తున్నదే గాని అందరి పనులూ సాగిపోతూనే ఉన్నవి. గృహస్థులు సుఖసౌఖ్యాలను అనుభవిస్తూనే ఉన్నారు. నిన్ను నిందిస్తున్నందుకు వారిని క్షమించవలసిందని కవి గ్రీష్ముణ్ణి వేడుకొంటున్నాడు.
సీ. ఉక్కయంచును నిన్ను ఒక్క పెట్టుగ తిట్టి
ఆవకాయల మునుగు నత్తగారు.
చెమట చీకాకుతో చెడెపని యనుకొంచు
క్రొత్తరసములు గ్రోలు కొడుకుగారు.
విసుగుచు నెండంచు వేపగంధము తీయు
నాటలో ముగ్గె నబ్బాయిగారు,
వడదాకు నని ముందు గడపదాటక తానె
కోయుకుందమ్ముల కోడలమ్మ.
తే. ఎవరి పని చెడిపోయెనో ఎరుకపడదు
యిన్ని సుఖముల మరుగుచు నిన్ను తిట్టు
వీరి కిచ్చుచు సౌఖ్యాల కోరి నన్ని
కీర్తి వెల్గొంద జేయవే గ్రీష్మరాజ!
'ఆకాశవాణి ప్రసారిక '
మధుప్రప
189