Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. "సిగ్గువడ మీరు నగ్నను జేసి చూడ
     అచటి కురుపుఁ బూర్తిగను నయమ్మొనర్చి
     నన్ను సుఖపెట్టఁ గలిగిన, మున్ను మీకు
     నిచ్చుకొందును నన్ను భోగింప నిచ్చ.”

తే. "ప్రణయ విక్రీడ మధురమై పరగె మనకు
     ఒకరి యెద పూర్తి యెరిగితి మొకర మొహోహో!
     ఎట్టి కోమల హస్తాల నిటు లిఖింతు
     వంగి పారాణి వినతి నా పాద యుగళి.”

తే. "ఉద్యమములకు పరమ ప్రయోజనముల
     గూర్పనవసర వేళలఁ గొంతమంది
     దేశ సేవికల్ పొంది యుద్దీప్తి ధర్మ
     వర్తనమ్మని ప్రౌఢలై వ్యభిచరింత్రు.”

తే. ఉద్యమములకుఁ పరమప్రయోజనములఁ
    గూర్పనవసర వేళల గొంతమంది
    వ్యభిచరింతురు ధర్మకార్యముల పగిది
    దేశ సేవిక లవికానె దివ్య కృషులు.

తే. కన్నెలం దెంతొ వైచిత్రి కలదు-వారు
    చిన్న యెలుకకు భయమంది బెదరిపోయి
    పిదప సాహసశీలులై ప్రీతిఁదూకి
    చిక్కు వడెదరు తోడేండ్ర చేతులందు.

తే. వనిత, బిడ్డలు గల తల్లి, భగము నద్దె
    కిచ్చి కనియె పిల్లను బ్రజ కెరుక పరిచి
    ఇందులకు వ్యతిరేకులై యెవరొ యడ్డ
    న్యాయ నిర్ణేత పిల్ల కన్నతని కిచ్చె. 168

తే. "వృత్తి, యుద్యోగ మెదియైన నింతులదియె
     యైన నార్థిక సాంఘిక యైన యట్టి
     దాని దగు స్థితి మిక్కిలి తరగిపోవు.
     నని జగత్కార్మిక సమాజ మనగలేదె.”


మధుప్రప

181