Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. "ప్రౌఢ పరిపాలనా ప్రచారమ్ము కొరకు
     నగ్నముగ మౌనముగ మహానగర వీధు
     లందు మొగవార లొకపంక్తి, యీడువాడు
     ప్రక్కనొకపంక్తి పయనింప వలసి వచ్చె.” 156

తే. "అక్క నీకిచ్చె నీ కోక, అద్ది నీవు
     కట్టుకొనుటను దిలకించి యెట్టులుండి,
     యెటుల సంతోషపెట్టునో యెఱిఁగి దాని
     ననుభవించి రమ్మని ప్రేమ నంపె నన్ను.

తే. "వీడు భర్తని యిత్తురు పిన్ననాఁడె
     పిల్ల మనసును జూడరు పెద్దవారు
     ఎవని చూచి పతియని భావించు నద్ది
     అతి పతివ్రత, పరమధర్మాన్వితయును.

తే. ఆమె వెనుకాడు టెరిఁగిన యతివ కాదు
    ఇష్ట పడునట్లు నటియించునింతి - నీవు
    నగ్నయగు నిశిఁబ పద్మినీనాథు పగిది
    చిత్తోనర్పుము, మది సంతసించునామె.

తే. భర్తఁ గోల్పోవుటను గడుబాల్యమందె
    కులటగానున్న కోడలి తలఁపు లెఱిఁగి
    యబ్బఁగా నున్న యపకీర్తి నాప మామ
    తానె రతి సౌఖ్యమొసఁగుట తగదె తలఁప.

తే. "ఆమె భర్తను చెలికత్తె యడిగె నేని
    యామె సమకూర్చు నాతని హర్షమునను
    కాయ విషయాల మగలకుఁ గలుగు నీర్ష్య
    జాలి వడెదరు స్త్రీలు దుర్జనుని యెడను.”

తే. "వాంఛతో వచ్చె నడిరేయి బావగారు,
     పాప మక్కయ్య ఇప్పుడే బయటఁ జేరె
     వద్దనన్నాడు అన్నమ్ము - ప్రక్కవేసి
     అక్కవలెఁ జేరి ప్రక్కనఁ జొక్కఁజేతు.” 162


180

వావిలాల సోమయాజులు సాహిత్యం-1