తే. "చేతనున్నది వడిసెల, చెడిపెవాఁడ
కంకులను గోయ వస్తివా? వాడి వెంట,
మంచె క్రిందికి రమ్ము నా మంచి పండ్ల
పూల, నీకిత్తు నాకిమ్ము భూరి సుఖము.”
తే. "చిలిపి పూవులఁ గోర నే చెరచినాఁడ
నెన్నిటినా తృప్తిపడి సంతసింప నవ్వి
అత్త! ఈ పూవుకోరెడి యర్ధమేమి?”
అనిన “చెరచుట కాకెద్ది?” యనియె నత్త.
తే. నలిపివేయ మటంచును నన్నుఁ గోరం
జిలిపి పూవుల నెన్నిటో చేసితటుల
లేతపూలివి నీయవి ప్రీతి యేమి?
అనిన “అన్యమే ముండు నం చనియె”
తే. "అడుగొ, కామమ్మ మగడని యంద రనఁగ
బిచ్చ మెత్తెడు నతని నిర్భీతిఁ బిలిచి
కాపురము సేసి కొడుకును గన్న పిదప
శంక జనియింపసాగె నా స్వాంతమందు"
తే. "ఏను రతిఁగూడి నిన్ను శిల్పింతు నిచట
మదన విగ్రహమని నాకు మాట నిచ్చి
నట్టి ఓ శిల్పి! కోర దేహమ్ము నిచ్చి
యెదుట నుండెద నయిన రాజేంద్రు సతిని.”
తే. "అమ్మ పుట్టింటి కేగఁగా నయ్యవారు
లొంటిగా నుంట నెఱిగిన యువిద లెవియొ
పనులు పడ్డట్లు విచ్చేసి పలుకరించి
ప్రణయవశుఁ జేయ సాగి రభ్యర్థనముల.” 126
తే. "నగ్న రూపాన శోభించు నాతిఁ గనియు
నెవని చిత్తమ్ము చలియింప దించుకైన
నాతఁ డింద్రియములఁ గెల్చి నట్టి యోగి
యని వచించుట యెంతయో యర్ధయుతము.
మధుప్రప
175