తే. "లైంగిక స్వేచ్ఛ పెద్ద లొసంగుచున్న
నష్టవర్షాల కన్నియ లయిన గర్భ
ధారణను బొందఁ గల్గు యాథార్థ్యమునకు
సాక్ష్యమిచ్చిరి వైద్యశాస్త్రజ్ఞు లిపుడు.” 114
తే. "తాతకాయమ నాల్గవ నాతి, యువతి
కాన దయతోడ వర్తించుఁ గామము నెడ
తానె రప్పించి యువకులఁ దనియఁ జేయు
నింతివారిచే, కనుచు హర్షించు నతఁడె.”
తే. "దూతిగాఁ బంపె నాతన్వి ప్రీతి నిన్ను
పరమచాతుర్య కామసంపన్న వీవు!
నన్ను వలలోన వేసుకొన్నావు తిరిగి
యరిగినపుడు తిట్టింపకు మలసటలను.”
తే. "ఎప్పుడాయన వచ్చునో యెరుఁగు కొఱకు
నింటి పరిచారి కను బంపి యెంతొ సేపు
దాటినది అద్ది మొనగత్తె, ఏటికడను
నే మొనర్చుచు నున్నారో యేమొ వారు.”
తే. "కామశాస్త్రమ్ము నందు విజ్ఞాని యగుట
చేసి స్నేహము నతనితో శిష్య నగుచుఁ
ఓడసి నేర్పునఁ జౌషష్ఠి బంధనములఁ
బేరుఁగొనియెద స్మరకళాభిజ్ఞనగుచు.”
తే. "ఏను శివరాత్రియని వచ్చి నాను నిన్ను
గలియలింగోద్భవమ్మగు కాలమునను
పొడమ ననురక్తి నాపయి కొడుకు నొసఁగఁ
గడఁగుమా నీవు బావ, శంకరుఁడ వయ్య.”
తే. "వెన్నెలకు విచ్చు నా పూవు, వెట్టి వడుచు
నేను చూపింతుఁ దోటకు నిపుడెవచ్చి
బావ కదియిష్ట మైనచో వలపు మీర
నలిపి వేయంగ వచ్చు నా తలఁపు లెఱిఁగి." 120
174
వావిలాల సోమయాజులు సాహిత్యం-1