తే. ఉందు మీయింట దాసినై యొక్క నాఁడు
ఆర్ద్రతను జూపి పోషింపు డయ్య నన్ను
పరిణయము నాడి వేశ్యగా బ్రతుకఁ జేయ
నున్న యువకుని వలలోన నున్నదాన.
తే. తండ్రి ముదివేశ్య కమ్మగాఁ దలఁచి తానె
కామసౌఖ్యాలు గొననైతి గర్భవతిని
వైద్యురాల నను బయటఁ బడగఁ జేయు
మీవు చూపిన యతని కయ్యెదను సతిని. 102
తే. "పేదలముగాన నీ తోడఁ బెండ్లి మానె
మామ మాటను నీ తోడి మనసు వీడ
జాలకను వచ్చుచుండు నా జాణ విడిచి
అతడి వలపు నీకెంతయో యవసరమ్ము. "
తే. "భర్త మృతి నొంది కాలేదు - పడతి! ఒక్క
మాసమైనను, సేవించి మంచి వారి
పొంది గుప్తమ్ముగా గర్భమొంద సుతుని
నర్ధ భాగమ్ము లభ్యమౌనాస్తి యతివ!
తే. "చెల్లెలి - కుమార్తె పెండ్లిని జేసుకున్న
అల్లుఁడా! నీకు నాకలి యైన చెపుము
ఎప్పుడెచ్చట నైననే నెఱిఁగి తీరు
అవసరమ్మైన కూతుండ్ర నంపి తీర్తు.”
తే. "జబ్బుతోఁ గూతు రెక్కి మంచమును నల్లు
కామభోగ దరిద్రునిగా నొనర్ప
నతఁడు పరకాంతలకు సఖుఁడైన చెడున
టంచు రతిసుప్తు లిచ్చి రక్షించె నత్త.
తే. "అన్న పరదేశమున కేగి యధిక కాల
మైన రాకుంట కడు వియోగార్తి వడయు
- 8. అర్ధ భాగమ్ము ధర్మ కార్యము కబ్బు
172
వావిలాల సోమయాజులు సాహిత్యం-1