శా. పారావారసు తామ్ర పర్ణితటినీ భాస్వత్సు సంయోగ సు
శ్రీరమ్యస్థలి రామభూవిభుడు పత్రీ సేతువు న్నిల్పి యే
పేరుకున్న ప్రతిష్ఠ సేసి కొలిచెన్ విశ్వే శు నెవ్వాని నా
శ్రీరామేశ్వరు నీశ్వరేశ్వరుని సుశ్రీయుక్తు సేవించెదన్.
శా. సౌరాష్ట్రమ్మున యామ్య సీమ మహిత స్పాయత్ సదంగంబునన్
సారాలంకృత సర్వదేహుడు మహా శాండీరు డౌ భోగి యై
ధీరప్రక్రియ భక్తి ముక్తు లిడుచున్ దీపించు నే శంభుడా
హేరాళోజ్జ్వల నాగనాథు శరణం బే నొందెదన్ రక్షకై.
శా. తానెవ్వేళ, ననాథ నాథుడయి, భక్త వ్రాత పాపఘ్నుఁడై,
యానందంబను కాననమ్మున మహాహ్లాదాను భోగంబుచే
నానందాద్భుత కందమై, పరగు నార్యానాథు, వారాణాసీ
శ్రీనాథున్, ఘనవిశ్వనాథు, గొలుతున్ శ్రేయోర్థినై నిత్యమున్.
మ. ఘన గోదావరి మూలదేశమున, విఖ్యాతంపు సహ్యాద్రిపై,
తను, దర్శించినవారి పాతకములన్, తర్జించి, భర్జించి, పెం
పున, వేవేగ హరించి, ప్రోచు, ప్రభు, శంభున్, త్య్రంబకేశ్వరుని
వినుతింతున్ పరమానురాగమున కావింపన్ శుభంబుల్ దమిన్.
శా. తాదాత్మ్యంబున, మౌని దేవ దనుజోధ్యక్ష నాళావళుల్
పాదాబ్జంబుల జేరి, కొల్తు రెవరిన్ భక్తిన్, భవుం, డెవ్వ డా
మోదంబొప్ప మహాద్రి పార్శ్వతటి సత్పుణ్య ప్రదేశంబునఁ
కేదారమ్మున, కొల్వు తీర్చె, నతనిం గీర్తింతు నత్యంతమున్.
గారామొప్పెగ, నత్యుదారగుణ విఖ్యాతిన్, జగద్వంద్యుడై
రారాజై, భువిలో నిలాపుర పవిత్రక్షేత్ర రమ్యస్థలిన్
ధీరత్వంబునఁ బ్రోచి భక్తతతి సందీపించు ఘుశ్మే శ్వరున్
నేరక్తిన్ శరణంబు నొండెద మహానిశ్రేయస ప్రాప్తికై.
తిరమై పోల్చెడు ఈ స్తుతిన్ వలచి జ్యోతిర్మూర్తులా ద్వాదశి
స్థిర లింగంబుల గొల్చి శంకరుడు, తాఁజెవ్వెన్ మహాభక్తి
నరు డిద్దాని పఠించునో యాతడు కృణ్యంబైన సాలోక్య
స్ఫుర ఉద్దామ పదంబు తత్ఫలముగా శోభిల్లు నత్యంతము 13
(ఈ పద్యాలను శ్రీరామ & కో ప్రొప్రయిటర్ ప్రత్యేక గ్రంథంగా ముద్రించినారు)
మధుప్రప
111