ఉ. శ్రామికరంగమందునఁ బ్రశంసల నందిన మార్పు వచ్చె నీ
భూమిని మున్ను లేని సుఖముల్ గలిగింపఁగ జీవితంపు బీ
మా, మరి వృత్తిచట్టములు, మంచిప్రసూతి గృహంబు, లుర్వి నిం
కేమి ప్రసిద్ధ దేశముల నేర్పడెనో యనియెల్లఁ జేకురెన్.
శా. సద్యోమోదము నిచ్చు బొమ్మ లివి, దేశంబందు సర్వత్ర పె
న్విద్యావ్యాప్తి ఘటిల్లె స్త్రీలు, పురుషుల్ విఖ్యాత సాంకేతిక
ప్రద్యుమ్నోజ్ఞ్యల విద్యలన్ బ్రబలభాస్వత్రైన్యవిజ్ఞాన, మ
వ్వైద్యామ్నాయము నెట్లు నేర్చెదరొ గర్వారూఢిఁ జూడందగున్.
ఉ. బానిస లైన యంత్రముల ప్రాపున పౌరులయాత్మశక్తియే
మౌ నని సందియంపడకుఁ డద్భుతదోహద మిచ్చి భావనా
నూనమనోజ్ఞనైపుణుల నొప్పుగ దిద్దుచు నీ ప్రభుత్వ మెం
తైన వివృద్ధి నేనెఁ గనుఁడయ్య కుటీర పరిశ్రమస్థితిన్.
శా. మళ్లా వచ్చెదఁ క్రొత్తబొమ్మలతో, నీమైఁ దెత్తుఁ గొంగొత్తలౌ
కళ్ళద్దాలనువాని పెట్టుకొని మీకన్నుల్ బలే క్రొత్త పో
కిళ్లన్ బోవునుపో, మరింక సెలఁవేగెన్ బ్రొద్దు, నన్నంపుఁడీ!
మేళ్లన్టెత్తు, నమస్తే మీకు మరి స్వామీ! మీకు మీ కియ్యదే. 24
ఎ.ఐ.ఆర్. విజయవాడ
మధుప్రప
109