Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది


శా. శ్రేయోరాజ్యముగా ఘటించితిమి, నిశ్రీకమ్ము దేశమ్ము, లే
    దీ యధ్వశ్రమమందు శ్రాంతి మన కిం కేనాఁడు యుద్ధాతురో
    పాయజ్ఞుల్ వలె నుండఁగా వలయు, నవ్యప్రక్రియ న్డీర్చి యే
    నీయజ్ఞానపుసంఘముల్ మలతుఁ బొందింప ననక్షేమముల్”.

మ. మన నిర్దేశకసూత్రపాళి నెద నమ్మానించుచున్ విస్తృతిం
    గని యా రెండవదౌ ప్రణాళిక మహాగంభీర గయ్యాళితోఁ
    జనుదెంచెన్ బెలుచై. పరిశ్రమలు రాజ్యద్రీతిఁ బెంపొందినం
    తన నుద్యోగికళాతముల్ పెరిగె నుత్సాహమ్ము దీపింపఁగన్.

శా. ఆరోగ్యంబును, నన్నముల్ వలయు నిత్యార్థంబులం గూర్పఁగా
    నా రూర్కేలను, రాంచి, ట్రాంబే జలహళ్ళందున్, భిలాయీలొ, కో
    లారందున్, హతియాకడన్ మఱియు నా ప్రాంతాల నెన్నింటినో
    భారీయెత్తున సృష్టియైన నవిగో, ప్రాజెక్టు వీక్షింపుడీ!

మ. అల సీమెంటుకు, బొగ్గుకున్ జమురు కాయారీతి లోహాల క
    వ్వల సైకిళ్ళకు, కుట్టుయంత్రములకున్, పంకాలకున్. డీడిటీ
    జలయంత్రాలకు, కాగితాలకును నా సల్పాల కిత్యాదికిం
    గల మాంద్యమ్ములు సన్నగిల్లి జనసౌఖ్యశ్రీరహించెన్ దగన్.

మ. నలుమూలల్ గన హెచ్చు నిట్టుల రవాణాతంతి సౌకర్యముల్
    తొలఁగె న్లోపము కార్లకున్ బలిసె విద్యుచ్ఛక్తి. 'టెల్ఫోన్లకు
    గలిగె న్పెంపిఁక రేడియో నిలిచిఁ గుగ్రామాలలో, నౌకలున్
    వెలసెన్ 'సింధియ' కంపెనీకడను - వీనిం జూడుఁడీ వేడ్కమై. 18

మ. వ్యవసాయంబున గల్గినట్టి యరుదౌ వ్యాప్తిన్ గనన్వచ్చు మీ
    రివి గనొన్న, జపానుసా గిదియె. ఇవ్వే క్రొత్తనాగళ్ళు, మీ
    రవధానంబునఁ జూడఁగా దగును ఘోరారణ్య విచ్ఛేదనం,
    బవల న్వచ్చెడు చిత్రముల్ దెలుపు నుద్యానాభివృద్ధిన్ దగన్.

మ. తమితోఁ జూడుఁడు కృష్ణ, కోసి ఇవి భద్రా, పెన్న, పాలారు లు
    ద్యమవృత్తి నగపొంగి యిట్టి నరు లాయా ప్రాంతదేశమ్ములం
    దమితార్తి న్గలిగించు. కట్టిరి గదయ్యా! భక్ర, నాంగల్, సిలే
    రు, మలంపూజలనందు డాములను నేర్పులమీఱ నెన్నింటినో.

వావిలాల సోమయాజులు సాహిత్యం-1