'గురుదేవుడు '
మ. అది కృష్ణాష్టమి, పుణ్య వాసరము నిత్యానంద గోస్వామి వా
రుదయాదిన్ నిజ శిష్య వర్గములతో నుల్లాస మందాకినీ
మృదు వీచీ పరిరంభ డోలికల తృప్తిజెంది సంకీర్తనల్
పదమందొక్కొక్క నూత్న జలతతో భక్తిన్ ప్రసాదించుచున్.
తే. గడచి యొక కొన్ని వీధుల నడచి నడచి
రాజమార్గాని కరుదెంచి రమ్య మధుర
భావ బంధుర గీతాలు పాడుకొనుచు
తొట్రు పడుచు లేచుచు తమ త్రోవజనుచు.
తే. తన్మయతలోన నొక మాటు తన్ను తానె
మరచి నిస్తబ్ధుడై కొంత, మరల తెప్ప
రిలుచు 'రారా! మనోహరా! పిలుపు వినియు
అటుల పరువెత్తె దేటికో? యనుచు పలుకు.
మ. పిలువన్ లేదొకరైన నాయెడ నవద్వీపమ్ము సర్వమ్ము ఏ
పిలుపో విన్నటు వచ్చి చేరినది - సంప్రీతిన్ రసోన్మత్తతన్
పులకల్ జెందని దౌను మాక్కటయున్ పోల్పగ లేదయ్యెపో
కలయేదో సత్యమన్న చిం త యట కల్గన్ తావు లేదయ్యెపో!
తే. స్వామి హిమధామ మధుర ప్రశంస చేయ
శీతకరుడయ్యె నొక మారు చిత్ర భాను
డమల వంశీరవామృత మభి నుతింప
పాదములెల్ల నవవేణువనము లయ్యె.
మ. తన సర్వస్వము కోలు పోయినటు చింతన్ మున్గి యున్నట్టి యా
ననమందించుక తెల్వితోప నయనానందంబుగా వెల్గుతూ
నను వర్తించుచు, స్వామి కన్నుగవలో నాషాఢ విద్యుద్యుతుల్
తొనకించెన్ మెరపించె, వేచనియె సంతుష్టిన్ దివాధ్వంబులన్. 6
102
వావిలాల సోమయాజులు సాహిత్యం-1