Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ఇంక నెన్నియో రీతుల నీశు ధనము
    నన్న సత్రాల కల్యాణయాగశాల
    లందుఁ గైంకర్య మొనరింతు వైన నేమి?
    తరుగ దయ్యెనే నీధనదాహ గరిమ?

శా. ఏరమాద్భుత దివ్యవర్ణనము నా కింపారఁ జూపించి ప్రే
    మారన్ ధన్యునిగా నొనర్చుటకు "రమ్మా! పుత్ర!" యంచాడె.
    యారజ్యద్రజతాచలేంద్రుఁ డిట నీ వత్యంత శత్రుండవై
    ఘోరంబౌ యపకారము స్ధలచి నాకుం గీడు కల్పించితే?

శా. ఆ కోలాహల మేమి? శంకరుని సంధ్యా తాండవాటోపమో?
    శ్రీకల్యాణమ నోజ్ఞమూర్తి యగు గౌరిన్ లాస్యమున్ జూపుమం
    చాకాకోలగళుండె కోరి సభలో నాదేశముం జేసెనో
    యేకాంతమ్మున వారిఁ జూచుట గాదె భాగ్యభాగ్యం బిలన్.

మ. పరిహాసోజ్జ్వల రమ్య కల్పనలచే భక్తులకు భృంగీశుడే
    సరసోక్తుల్ పచరింప స్వామి సుఖియై స్వాంతంబునన్ మెచ్చునో
    చిరకాలార్జిత సత్క విత్వ మధుర స్నిగ్దాప గాంభస్సులన్
    బరమేశున్ కనియిటు నంది నను కృపావృష్టి లాలించునో?

మ. సురలున్ శత్రులు మిత్రులై జలధి నస్తోక ప్రమోదమ్ముతో
    దరువంగా నమృతార్థులై గరళ ముద్యత్ఫూత్కృతిన్ గ్రమ్మ వా
    రరుదేరన్ శరణమ్ము వేడుచు ఘనా హ్లాదంబుతో వీరవై
    ఖరి నద్దానిని బట్టి మ్రింగి నిలిపెన్ కంఠంబునన్ శంభుడున్!!

చ. తనసతిఁ గోలు పోయి హిమధాత్రి ధరమ్మున దీవ్రదీక్ష
    కొని తపమాచరించు తరి కూర్చుటకై నగరాజు పుత్రి నా
    మనసిజు పడ్డ యత్నము సమస్తము భగ్నమొనర్చి శర్వుడాఁ
    వనిత తపమ్ము మెచ్చి నిజపత్నిగఁ జేకొనియెన్ స్వయమ్ముగన్. 18

శా. దుర్వారుల్ త్రిపురాసురుల్ ప్రబలులై దోస్సారమున్ నమ్మిదు
    ర్గర్వాహంకృతి సర్వలోకములపైఁ గాల్దవ్వ నింద్రాదులు
    న్సర్వంబున్ గోలు పోయిన యెడ న్సంగ్రామ రంగ స్థలిన్
    శర్వుం డెక్కటి వీరుడై గెలిచె నా శౌండీరులన్ ధీరులన్.


100

వావిలాల సోమయాజులు సాహిత్యం-1