పుట:Varavikrayamu -1921.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము

85


మూడు పెండ్లిండ్లయినాయి. ముప్ఫయి వేలు కట్నాలు వచ్చాయి! మునిసిపల్‌ మెంబరీకోసం మూడుసార్లు స్టాండైనాఁడు.

న్యాయా :- (నవ్వి) ఆయన చరిత్ర ఇప్పుడవసరము లేదు కాని రాజీ మాట రవంత ఆలోచింపుడు!

వెంగ :- ఈ విషయంలో యీశ్వరుఁడు చెప్పినా మాక్లయింటు వినడండి. దావా మా పక్షం కావడానికిపట్టెడు రికార్డుంది. బోలెడు సాక్ష్యము వుంది. అలహాబాదు ట్వంటీ త్రీలో అత్తవారు పెట్టిన నగలును హరించకూడదని అయిదు పేజీలు వ్రాసాడు! కలకట్టా ట్వంటీ ఫోర్‌లో పిల్లను కాపరానికి పంపి తీరాలని వుంది!

న్యాయా :- మీ తీర్పులన్నియుఁ దీరిక సమయమునఁ జూచెదను! ఏమి లింగరాజుగారూ! మీ అబ్బాయిని మీ రొప్పింపలేరా?

లింగ :- చిత్తము చిత్తము. కోర్టువారి చిత్తమట్లున్నప్పుడు కోటిరూపాయలు పోయినఁ పోవుగాక! మా నగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికిని మాకును సంబంధము లేకుండఁ జేసికొనుటకు వారు ఇష్టపడిన యెడల, మా అబ్బాయిని నే నొప్పించెద.

న్యాయా :- (పక్కున నవ్వి) ఏమీ, కోడలేల పనికి రాదు!

లింగ :- ఆ పిల్ల మా యింటఁ నణకువతోఁ కాఁపురము సేయదండి.

న్యాయా :- ఏమి పురుషోత్తమరావుగారూ! అమ్మాయికి నచ్చఁజెప్పి అత్తవారి యిష్టానుసారముగ నడచుకొనునట్లు చేయలేరా?

పురు :- అయ్యా! నే నసహాయవాదిని. అందువల్ల మీ ప్రశ్నమున కుత్తర మొసంగుటకు నా కవకాశము లేదు.