86
వరవిక్రయము
కమ :- సరే దీనికి సమాధానమేమియుఁ వ్రాయవలదు. దావా కూడ దాఖలు కానిండు.
పురు :- అమ్మా! నీ అభిప్రాయమేమో నాకు బోధపడలేదు. "నన్నిప్పుడేమియు నడుగవలదు. సమయము వచ్చినప్పుడు సర్వముదేటఁ పడఁగల"దని నీ వాదిలోఁ జెప్పియుండుట చేత నిన్నేమియు నిరోధించి యడుగలేదు. కాని ఏమి యపకీర్తి వచ్చునో యను నాందోళన మాత్రము లేకపోలేదు. అదిగాక.
గీ. పరులకుం దాస్య మొనరించి పరువు మాలి
బ్రతుక జూచుటకంటెను బస్తు మేలు,
సరస మెఱుఁగనివారితో జగడమాడి
కోర్టు కెక్కుటకంటెను గొఱత మేలు?
కమ :- అది నిజమే కాని యీ వ్యవహార మట్టిది కాదు. దీనికై మీ రించుకయు దిగులు పడవలసిన పనియు లేదు. సర్వము నాకు విడిచిపెట్టి మీరు శాంత మనస్కులరై యుండుడు.
పురు :- సరే కానిమ్ము. నీ మాటయే నాకు నిట్రాట. (నిష్క్రమించును.)
కమ :- (ఆకసమువంక చేతులు జోడించి) ఓ సర్వేశ్వరా!
ఉ. గట్టిగ నిన్నె నమ్ముకొని కష్టము లోర్చినవారి నేరి చే
పట్టి భరించు కేవల కృపామయమూర్తి వటంచు నెట్టనం
బట్టితి నీదు పాదములు, బాలను, బేలను, దీనురాల న
న్నెట్టులు తేల్చెదో! తరుణ మియ్యది యే సుమి డాయ వచ్చెడున్.
(తెరపడును.)
(ఇది అష్టమాంకము.)
★ ★ ★