పుట:Varavikrayamu -1921.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమాంకము

83


చున్నారో యెందరి వుసురు నీ యింటావంటా చుట్టుకుంటూ వుందో యెరక్క ఇంత పొంగి బోర్ల పడుతున్నావు! భగవంతుడు మా మొర వినకాపోడు. పటుక్కున నీ దుంపతెంపకాపోడు! ఈసారి నిన్నెలాగు ఈడ్చి పారేస్తారు. ఈ మాటలు మాత్రం మనస్సులో వుంచుకో! ఇకసెలవు! (నిష్క్రమించును.)

వెంగ : -హమ్మా! హమ్మా! ఎంతలేసి మాటలన్నాడు! ఆ వెధవ అల్లా దులిపేస్తూవుంటే పాడునోరు పైకి లేచిందే కాదేం? ఇదే కామోసు గిల్టీకాన్‌షన్ అంటారు! నిజంగా యింత నిర్భాగ్యపు వెధవను నేఁ నిదివరకెన్నడూ కాలేదు. నా ధూంధాంలు చూచి, నలుగురు టీచర్లూ నా యంతవాడు లేడనుకునేవారు. ఈ సంగతి తెలిస్తే ఇకనన్నెవడైనా లక్ష్యపెడతాడా! సమయానికి చాకలి వెధవకూడా లేకుండా పోయాడు! అవసరానికి లేకపోయినందుకా వెధవను డిస్మిస్‌చేసి తీరుతాను! అదెవరు?

లింగ :- (ప్రవేశించి) ఈ పూట పంతులుగారింత తీరికగా నున్నారేమి?

వెంగ :- దయచెయ్యండి! యేమి తీరిక! యేమిలోకం! పార్టీ లంతా యిప్పుడే బసలకు పోయారు. ఎవరో టీచరువచ్చి, యేదో చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి సమాచారం? కూర్చోండి!

లింగ :- (కూర్చుండి) పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తెను మా పిల్లవానికిచ్చిన సంగతి మీరెఱిగినదే గదా? వివాహ కాలమున నాలుగువేల రూపాయల నగలుంచినారు. వివాహమై మూడేండ్లు కావచ్చినది. పిల్లను గాపురమునకు బంపరు. మా నగలు మా కిమ్మన్న మాటాడను మాటాడరు. అసలు రహస్యమేమా? ఆ నగలు మనవి కావు. తరువాతఁ జూచుకొందమని తాకట్టు వస్తువులు తీసి తగిలించినాను. తాకట్టు పెట్టిన వారిపుడు నన్ను తాటించుచున్నారు.

వెంగ :- కార్యంకాగానే చల్లగా సంగ్రహించుకోక పోయారా?

లింగ :- అప్పటి నా యభిప్రాయమదే కాని సాగినది కాదు. ఆపిల్ల ఎలాగుననో నా యభిప్రాయము కనిపెట్టి అందుల కవకాశము చిక్కనిచ్చినదిగాదు.