66
వరవిక్రయము
మీవాళ్ళు కాఫీహొటేళ్ళకుపోతే మావాళ్ళు రెపరేషుమెంటు రూములకు పోతున్నారు! విన్నారా? ఇన్ని మాటలెందుకూ? ఇప్పుడు మీరన్న మాటల్లో యేం నియోగముంది? ఆనక కోర్టుమాట ఆలోచించుదాం. యీసంగతి పైకివస్తే పదిమందీ మిమ్మల్ని బ్రతుకనిస్తారా? ఈరోజుల్లో యింత చప్పని ఆలోచన మేము చేస్తామా!
లింగ :- అట్టయిన, నీ కమ్మని యాలోచన యేమో కాసింత చెప్పుము.
పేర :- అదిగో అల్లా అడగండి! ఆ సొమ్మూ, ఆభూమీ దక్కించు కోవాలంటే ఆ రెండోపిల్ల నెల్లాగయినా చేసుకోవడమే సాధనము. మఱి యే దారి త్రొక్కినా మర్యాద పోక మానదు.
లింగ :- అందుల కాయన యంగీకరించుట లేదని విన్నానే?
పేర : -అది నిజమే. అయినా, నన్ను ప్రయత్నం చెయ్యమంటే చేస్తాను.
లింగ :- ప్రయత్నము చేయుట కాదు. పనియే చేసికొని రావలయును.
పేర :- సరే నాశక్తి యావత్తూ ధారపోస్తాను. శలవు. (నిష్క్రమణ)
లింగ :- ఇంటను బయటను గూడ నల్లరి పడుటకన్న నిదే మంచిపని! పోయెనా దానితో పాటుగ నిది గూడ పోనే పోవును. లేదా అది యున్నది నే నున్నాను.
(తెర పడును.)
రెండవ రంగము
ప్రదేశము: పురుషోత్తమరావుగారి కచేరి చావడి.
ప్రవేశము : క్రిందఁ గూర్చుండి యొకవంక పురుషోత్తమరావుగారు, పేరయ్య, మఱియొక వంక కమలను ముందిడుకొని భ్రమరాంబ.
పురు :- చివరకు దేలిన యంశమేమి?