Jump to content

పుట:Varavikrayamu -1921.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వరవిక్రయము

"మా పురమునందలి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కుమార్తెను లుబ్ధాగ్రేసర చక్రవర్తి యగు సింగరాజు లింగరాజుగారు తన కుమారునకుఁ జేసుకొనుటకై, అయిదువేల అయిదువందల రూపాయల కట్నము విధించి, యా సొమ్ము కార్యమునకు ముందే కాఁజేసిరి! కట్నపు పెండ్లి యెడ నిష్టము లేక కాళింది యను చిన్నది తల్లిదండ్రుల కొక యుత్తరము వ్రాసి తన బల్లపైనుంచి బావిలోపడి ప్రాణములు విడిచెను! ఆ యుత్తరము నందున్న మాటలివి.

"నా ప్రియమైన తల్లితండ్రులారా! నమస్కారములు! కట్నమిచ్చి తెచ్చిన వరునిచేఁ గళ్యాణసూత్రము కట్టించుకొనుట గౌరవహీనమనియు - నా వివాహమునకై మీరు సర్వస్వము సమర్పించుట నా క్షేమమునకును, మీ సౌఖ్యమునకును గూడ భంగకరమనియు భావించి - ఈ రెంటియొక్కయు నివారణమునకై నేనీ లోకమును విడిచిపోవ నిశ్చయించుకొని యీ జాబువ్రాసి యిచ్చటినుంచి యనుజ్ఞ తీసికొనుచున్నాను. అమ్మకాని, మీరుకాని, నాకై అణుమాత్రమును జింతింపవలదని ప్రార్థించుచున్నాను. మీ యిరువురుకును బునః ప్రణామములు. చెల్లెలికి ముద్దులు!

ఇట్లు విన్నవించు మీ యనుంగు పుత్త్రిక "కాళింది"

"ఒక పౌరుడు"

లింగ :- (ఆగ్రహముతో) ఈ పౌరుఁడెవ్వడో తెలిసికొని పరువు నష్టముక్రింద బదివేలకు దావా పడవేయవలసిందే! ఈ లుల్లిగానికి నేను లుబ్ధాగ్రేసర చక్రవర్తినట. ఏమి పొగరు.

పేర :- (అంతలోఁ బ్రవేశించి) అంతమాట మిమ్మనగలవాడెవడు?

బస :- (లేచి చక్కఁబోవును.)

లింగ :- రావోయి పేరయ్యా! రా; ఏమిటి విశేషాలు?

పేర :- (కూర్చుండి) ఏం చెప్పను? భ్రమరాంబగారి దుఃఖం పట్టలేకున్నాం.

లింగ :- అది సరేకాని ఆ చచ్చిన దెష్ట ఆముడి కాసింతయు పడిన తరువాతనైన జచ్చినది కాదేమోయి?

పేర :- అవునవును. అలాజరిగితే ఈ భూమిదక్కి, ఈ అయిదు