పుట:Varavikrayamu -1921.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము

మొదటి రంగము

(ప్రదేశము: లింగరాజుగారి వ్యాపారపు గది.)

లింగ :- (బల్లకడ గూరుచుండ ప్రవేశించి) ఈ క్రొత్త గింజల దినములలోఁ గోమట్లు బదుళ్ళకొరకుఁ గొంపచుట్టు దిరిగెడివారు. ఈయేఁ డింతవరకు వచ్చి యడిగిన వారే లేరు!

గీ. ఆస్తి కలిగి తీఱుపలేని యప్పె యప్పు,
   నూరు గొని వేయికై వ్రాయు నోటె నోటు,
   పసిడి తాకట్టుపై నిచ్చు బదులె బదులు,
   రోజు వడ్డీలు వచ్చిన రోజె రోజు.

ఘంట :- (వచ్చి) బాబూ! బట్టలు కొనుక్కుంటాను. జీతమిస్తారా?

లింగ :- నీ బట్టలు పాడుగాను! ఎందుకురా బట్టలు! గాంధి మహాత్ముని జూడరాదా, గావంచా కట్టుకొని తిరుగుచున్నాడు.

ఘంట :- గాంధిగార్ని మెచ్చుకుంటారు గదా ఖద్దరు కట్టరేం మీరు?

లింగ :- ఆవిషయములో, ఆయనకు మతిలేదురా! కట్టు కట్టు మనుటయే కాని, ఖరీదు తగ్గే సాధనము చూచినాడు కాడు.

ఘంట :- మీకున్నమతి ఆయనకు లేదుగాని నాజీతం మాటేమిటి?

లింగ :- ఆనక చెప్పెదగాని అమ్మగారేమి చేయుచున్నది?

ఘంట :- గదిలో కూర్చుండి కథలు చదువుకుంటున్నారు.

లింగ :- నిన్నా వైపునకు వెళ్ళవద్దంటిని గదా యెందులకు వెళ్ళినావు?

ఘంట :- బాగానే వుంది! యేవైపూ వెళ్ళక యెల్లాగండీ? ఆవైపుకు