Jump to content

పుట:Varavikrayamu -1921.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

55


ఐనా ఆడపిల్ల నింత హద్దు మీరనివ్వగూడదు. అందుకనే ఆడు పిల్లలకు చదువంటే, నా అరికాలు మంట నెత్తి కెక్కుతుంది. వెనక నో సారి మా పెంకిముండ ప్రక్కయింటి పిల్లతో బళ్ళోకి వెళ్ళడానికి సిద్ధపడితే నేనేం చేశాను? స్తంభానికి కట్టి చావగొట్టాను అక్కడితో ఆరోగం వదలి అయిదుగురు బిడ్డల తల్లయ్యింది. (అనుకొనుచు నిష్క్రమించును.)

పురు :- (రవంత నడయాడి) ఔరా! దురదృష్టము.

చ. కరమును నీతిబాహ్యములు కట్నపుఁ బెండిళు లంచు సుద్దులన్
    గురిసెను నిన్నదాఁక, దన కూతుఁ వివాహముపట్ల నేడు కి
    క్కురు మనకుండఁ గాళ్ళకడకున్నడిపించెను గట్న మంచు న
    ల్గురు ననుగురించి లేవిడులు గొట్టెడు యోగముపట్టె నేమనన్‌.

(తెరపడును.)

ఇది చతుర్థాంకము


★ ★ ★