పుట:Varavikrayamu -1921.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాంకము

43


"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీ కుమార్తె చి||సౌ|| కాళిందిని నా కొమారుడు చి|| బసవరాజునకు చేసికొనుటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల ఐదువందల రూపాయల రొఖ్కము, రవ్వల యుంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావకోళ్ళు, పట్టు తాబితాలు, వియ్యపురాలు, వియ్యంకుల లాంఛనలములు యథావిధిగా నిచ్చుటకును. ప్రతిపూట బెండ్లివారిని బ్యాండుతోఁ బిలుచుటకును, రాక పోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకును, రెండుసారులు పిండి వంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, యుప్మా, యిడ్డెను, దోసె రవ్వలడ్డు, కాజా, మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారమైదుదినములు మమ్ము గౌరవించుటకును అంపకాలనాడు మాకు పట్టుబట్టను, మాతో వచ్చువారికి కుప్పాడ బట్టలు నిచ్చుటకును నిర్ణయించుకొని బజాన క్రింద పది రూపాయలిచ్చినారు. గనుక ముట్టినవి.

"సింగరాజు లింగరాజు వ్రాలు" చాలునా?

పేర :- చాలుబాబు! చాలు! మచ్చుకోసం దాచిపెట్టి తేవలసిన మతలబు! (అని రసీదు తీసుకొని పురుషోత్తమరావుగారి కిచ్చును.)

పురు :- బావగారూ! మాకిఁక సెలవా?

లింగ :- చిత్తము, చిత్తము. తాతగారు పిల్లపేర వ్రాసి యిచ్చిన దస్తావేజొకసారి పంపెదరా?

పురు :- అభ్యంతరమేమీ? అట్లే పంపెదను.

(తెరపడును)

ఇది తృతీయాంకము