పుట:Varavikrayamu -1921.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

వరవిక్రయము

పేర:- రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజుగారి ఇంటికి వెళ్ళి, సంగతి సందర్భాలు చూచుకుని, సాయంకాలంలోగా వస్తాను.

భ్రమ:- ఏమో, యేమి చేసికొని వచ్చెదరో పిల్లల వివాహము భారము మీది. మిమ్ములను సంతోషపెట్టు భారము మాది!

పేర:- అమ్మా! ఆమాట మీరు వేరే సెలవివ్వాలా! కార్యమయిందాకా కన్ను మూస్తే ఇది గాయిత్రి గాదు! శలవు!

(తెరపడును.)


ఇది ప్రథమాంకము.


★ ★ ★