పుట:Varavikrayamu -1921.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

వరవిక్రయము

కమ:- (నవ్వి) హార్మోనియము కావలయును! ఆఁ వాయించగలము.

పేర:- అల్లికా, కుట్టూ - యివేమయినా చేతవునా? ఇదుగో? ఈ బ్రాహ్మడేమి, యిన్ని ప్రశ్నలు అడుగుతున్నా డనుకుంటారేమో? ఈ రోజులలో పెళ్లి కుమార్తెలకు కావలసిన లక్షణా లివ్వే. అందుకోసము అడుగుతున్నాను. అరుగో పంతులుగారు వస్తున్నారు. చిటికెడు పొడుం పీల్చుకుని సిద్ధంగా వుంటాను. (అని యట్లు చేయును.)

పురు:- (ప్రవేశించి) ఏమీ! పేరయ్యగా రెండలోనే వచ్చినారే. రవంతసేపు పండుకొని కాని రార నుకొన్నాను. (అనుచు నింకొక కుర్చీలోఁ గూరుచుండును.)

పేర:- సరిసరి యెంతమాట? తమ సెలవైనాక, తక్షణం చేతులు కట్టుకొని వచ్చి వాల్తాను గాని, నిద్రపోతానా!

పురు:- అమ్మాయిలను జూచినారు గదా? వీరికే యిపుడు వివాహములు కావలసియున్నవి. అమ్మా! మీరిఁక భోజనమునకు వెళ్ళి మీయమ్మ నొకసారి యిటు పంపుఁడు.

కాళి, కమ:- (లేచి నిష్క్రమింతురు.)

పేర:- తమ గోత్రమేమిటి?

పురు:- కౌశిక గోత్రము.

భ్రమ:- (ప్రవేశించును.)

పురు:- ఇరుగో! ఈయనయే పేరయ్యగారు. పాపము, నామాటమీఁద పడక కూడ మాని చక్కవచ్చినారు.

భ్రమ:- సంబంధము లెవ్వియైన సానుకూలపడు నన్నారా?

పేర:- అమ్మా! సంబంధాల కేమి లోటు? కో అంటే కోటి సంబంధాలు! అయితే సరా, వేలు పెట్టి చూపడానికి వెల్తిలేని సంబంధం సందర్భపడాలి. ఏం బాబూ! ఏమంటారు?

పురు:- అంతేకాని, అసలు సంగతి మీతోఁ జెప్పలేదు. నేను వరశుల్కము దూష్యమనే వాదములోని వాఁడను. ఈ దురాచారము మానిపింపవలెనని, యిప్పటికి ఐదేండ్ల నుండి పాటుపడుచున్న వాఁడను. ఈ కార