ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102
వరవిక్రయము
సీ. ఆడుబిడ్డల వివాహములకై తండ్రులు
పడుబాధ లెల్లను బాయుఁ గాక!
లింగ :- కట్నాల కోసము గడ్డికఱచువారి
కెల్ల నా పాట్లె ఘట్టిల్లుఁగాక
బస :- పణములు గొనువారు భార్యల కేప్రొద్దు
నూడిగంబులు సేయుచుంద్రుగాక
కమ :- వెలమగల్ మెడలఁబుస్తెలు కట్టు దౌర్భాగ్య
దశ కన్నియల కింకఁ దప్పుఁగాక!
భ్రమ :- కట్నముల నందుకొంటయే గౌరవమను
వెడఁగుదన మాడువారిని వీడుఁగాక!
అందరు :- ఉర్వి నన్నిటఁ గాళింది కుద్ధియైన
వెలదులే యెప్పుడును బ్రభవింత్రుగాక!
సంపూర్ణము
★ ★ ★