పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3

ఉపోద్ఘాతము

నామకరణము కేవలము దశరథమహారాజు కోరికపై వసిష్ఠమహర్షి కౌసల్యాదేవికి జనించిన పుత్రునకుఁ జేయఁబడినదని తెలిసి కొందురు గాత. ఇఁక 'రామ' అను నామ మందలి గూఢార్థమును దెలిసి కొందము. రామ నామమున కనేకు లనేకార్థముల నొసంగు చున్నారు, 'రామ' అను శబ్దమున ర-అ-మ అను మూఁడు వర్ణము లిమిడి యున్నవి. ర, అను నక్షరమునకు శత్రువుల భస్మీకరించు వాఁడనియు, అ, యను వర్ణమునకు ప్రకాశ ప్రతాపాది గుణముల నొప్పువాఁడనియు, మ, యను నక్కరమునకు నాహ్లాదమును గూర్చు వాఁడనియు నర్థముఁ జెప్పుదురు.

అదియుఁ గాక యోగిపుంగవులు సమాధి కాలమున నతని యందు రమిం తురు గాన 'రామ' అనీ యందురు. జనులను సౌందర్యాది గుణములచే రమింపఁ చేయు వాఁడు, 'రాముఁడు' అని చెప్పుదురు. ఆశ్రితుల నానందింపఁ జేయువాఁడు “ రాముఁడు'. ఇటులనే ' రామ నామపుఁ జెలమ'ను జల్లు కొలఁది, అందుండు నానార్థ జలరాశి యూరుచునే యుండును. కనుక రామనామ మందలి గూఢార్థ చర్చ నింతటితో ముగింతుము.

మన దేశము హిందూదేశము. మనము హిందువులము, మన మతము హిందూమతము. అట్టి హిందూ మతమునకు సర్వేశ్వరుని దివ్య ప్రభావమును విశదీకరించి భగవంతుని యందు భక్తిని నెలకొల్పు వేదములే ప్రామాణిక గ్రంథములు. వేదములు మనకెట్లు ప్రామాణికము లయ్యెనో యటులనే వాల్మీకిమహర్షి వలన రచింపఁబడిన శ్రీమద్రామాయణము స్రష్ట యాజ్ఞానుసారము నారద మహాముని యుపదేశము ననుసరించి రచింపఁ బడినందున నీగ్రంథమునకుఁ బ్రామాణిక గ్రంథముల ఘనత సంభవించె ననుటలో నతిశయోక్తి దోసము కలుగదు.

సంపూర్ణావతారుఁడగు శ్రీ రామచంద్రుని చరిత్రయే శ్రీమద్రామాయణ మని మరలఁ జెప్పఁ బని లేదు. అట్టి మహాకావ్యమును రచించిన యాదికవి శ్రీ వాల్మీకిమహర్షి కీర్తిచంద్రికలు నల్దిశల వ్యాపించి స్థిర స్థాయియై వెలయుటయే గాక యమ్మహర్షి శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములకుఁ బాత్రుఁడై మోక్షమును సాధింపఁ గలిగెను.

భగవంతుని కృపాకటాక్షము వలన మనకు లభించిన యా శ్రీరామ చంద్రుని చారిత్రక పవిత్ర గ్రంథ రాజమును జతుర్విధ పురుషార్థములఁ గాంక్షించి పఠించినచో వారి జన్మము సార్ధక మగుననుట తథ్యము, శ్రీ రామ అను పవిత్ర