పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరస్తు


శ్రీ రామచంద్రపర బ్రహ్మణే నమఃశ్రీమదుత్తరరామాయణముపీ ఠి క.


______


శ్లో. చరితం రఘునాథస్య శతశోటి ప్రవిస్తరం,
ఏకై కమక్షరం ప్రోక్తం మహా పాతక నాశనమ్'.
రామాయ రామభద్రాయ రామచన్ద్రా య వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః,

§§§§ఇష్ట దే వ తా ప్రార్థనము§§§§


శ్రీరాధాధరబింబము దొరయురాచిల్కన్ నిజోరస్థ్సలీ
రారాజన్మణికాంతి రాఁ బిలిచి తద్రా కేందుబింబాననా
స్మేరాంకూరము చేఁ గృతార్థుఁ డగుచుం జె ల్వొందు గోపాంగనా
జారగ్రామణి కృష్ణుఁ డీవుత మహైశ్వర్యంబు మా కెప్పుడున్ 1

≈≈≈≈లక్ష్మీ స్తుతి≈≈≈≈≈


సీ. పుష్కరవిహరణస్పురణంబు వహియించి
                      యచలానుగుణవృత్తి యవధరించి
యార్యాభిగణ్య సౌకర్యంబును
                     రహించి ప్రబలహిరణ్యవర్ధనత మించి
త్రిభువనాంచితరూపవిభవంబు ప్రాపించి
                     భృగుకులంబు పవిత్రముగ జనించి
యంభోధిభంగలీలాసక్తి వర్తించి
                     కామపాలనరీతి ఖ్యాతిఁ గాంచి
తే. పుణ్యజనముల పూజనములు గ్రహించి
కలికితన మెందు నిట్టిది కలదె యనఁగఁ
జెలువు చెలువున నలు వొందు కలిమిచెలువ
మెచ్చి నిచ్చలు మాకోర్కు లిచ్చుఁగాత. 2