9
ఉపోద్ఘాతము
పీఠికలోని ఇరువది యేడవ పద్యమునుఁ జదివినచోఁ దెలియఁ గలదు. ఇక గ్రంథ కర్త వంశమును గూర్చి పరిశీలించిన నిట్లున్నది.
ఇంతటి పాండిత్యమును ననర్గల కవితాధారయుఁ గలిగిన యిక్కవికుల తిలకుఁడు వాల్మీకి మొదలుగాగల మహాకవులు శ్రీమద్రామాయణమునే సంస్కృతాంధ్రములలో రచించి శ్రీరామకటాక్షముసకుఁ బాత్రులు కాఁగోరి నటులఁ దాను కూడ రామాయణకథనే రచించి శ్రీరామచంద్రుని కటాక్షమును సంపాదింపఁ గోరక యేలకో ఉత్తర రామాయణమునే రచించి భగవంతుని యనుగ్రహ మునకుఁ బాత్రుఁడు కాఁగోరెను.
శ్రీమదుత్తర రామాయణమును తాను రచింపఁ బూనుటకుఁ గల గారణము పాపరాజు రచించిన కృతిప్రశంస లోని పదునాలవ పద్యమును జదివినఁ దెలియఁ గలదు.ఈకవి తన పదునైదవ పద్యమున అన్నిటికంటే నుత్తమమైన మానవ జన్మము నెత్తిన వాడు విద్యాధనమును గడించి కవియై శ్రీరాముని దివ్యచరిత్రమును బాడికీర్తింపనిచో నట్టి పురుషుని జన్మము నిరర్థకమని వాక్రుచ్చెను. అనఁగా పాపయామాత్యునకు శ్రీరామచంద్రుని మహాశక్తి యందును, శ్రీరామచరిత్ర మును రచించుట యందును నంత నమ్మక ముండినదని తెలియు చున్నది. వాల్మీకి మున్నగు కవులవలె రామాయణమునే కాక శ్రీరాముని మహిమలఁజాటు