Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ఉపన్యాసపయోనిధి.

బ్రాహ్మణమువలన ప్రతిమానవుఁడును దానధర్మములను జేసితీరవలెనని తేలుచున్నది. ఇట్టిధర్మములను బోధించు మతము నసాంఘికమనుట మహాసాహసముకాదా ? ఈ బ్రాహ్మణమువలన ప్రతినరుఁడును విద్యాబుద్ధులు సంపాదింపక తప్పదని తెలియవచ్చుచున్నది. ఇట్టిబోధగలమతము నన్యధాభావించుట వింతకాదా.

స్మృతులు పంచఋణములను దెలుపుచున్నవి. అయిదవఋణము జంతువులు వృక్షములు మొదలగు వానిని గూర్చినదై యున్నది. ఇట్టి హిందూమతమును మనశివనాథశాస్త్రిగా రసాంఘిక మన సాహసించిరి.

ఇంకను ప్రతిమానవునకును బంచఋణములేగాక పంచ సూనములుకూడఁ గలవని మనుస్మృతి తెలుపుచున్నది.


"శ్లో॥ పంచసూనాగృహస్థస్యఛుల్లీ పేషణ్యువస్కరః ।
    కండనీచోదకుంభశ్చ బధ్యతేయాస్తువాహయన్.


సూనము లనఁగా పధస్థానములు. ఇవి ప్రొయి రోలు చీపురు ఉదకుంభము సన్ని కల్లుననునవియైయున్నవి. వీనిమూలముగా జీవహింస జరుగుచున్నది. కాన పంచ యజ్ఞములు మనుజుఁడు చేయవలెనని మనుస్మృతి విధించుచున్నది.


శ్లో॥ తాసాంక్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహషిన్‌భిః।
   పంచక్ల్‌ప్తామహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్॥

"శ్లో॥ అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణం।
    హోమోదైవోబలిర్భౌతో నృయజ్ఞోతిథిపూజనమ్॥"