Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూమతము ఒంటెత్తుతనమును గలిగించునదియా.

71

మఱియును మనుజుఁడు ఋణములతోఁ బుట్టుననియు వాఁడువానిని దీర్చికొనవలసినదనియు శతపథబ్రాహ్మణము తెలుపుచున్నది. అదియేదియన -

“I. Verily, whoever exists he in being born is born as (owing) a debt to the gods to the Rishis to the fathers, and to men."

(మనుజుఁడు నాలుగు ఋణములతోఁ బుట్టుచున్నాఁడు. (1) దేవఋణము (2) ఋషిఋణము (3) పితృఋణము (4) మనుష్యఋణము.)

మఱియును యజ్ఞయాగాదులవలన (దేవపూజ) దేవఋణమును ఆధ్యాత్మ విద్యాస్వీకారము వలన ఋషిఋణమును సంతానమువలన పితృఋణమును దానథర్మముల వలన మనుజఋణమును ప్రతినరుఁడు తీర్చికొనుచున్నాఁడు. అనిశతపథబ్రాహ్మణము నొక్కి చెప్పుచున్నది.

సంఘాభివృద్ధి కింతకంటె నెక్కుడు ధర్మమేదికావలెనో తెలియవచ్చుటలేదు. ఈవేదమంత్రము ప్రతినరుని సంసారము స్వీకరించి సంతానమును బడయవలసినదని నొక్కి చెప్పుచున్నది. దీనిననుసరించియే యొకఁడు వివాహము చేసి కొకన తిరుగుచుండఁగా వానిపితరులు ఆధోగతి పాలగుచున్నట్లు కాన్పించినదనియు దాన నాతఁడు వివాహముచేసికొనె ననియు భారతము చెప్పుచున్నది. ఇఁక హిందూ ధర్మములనసాంసాంరికము (anti-social) లనుట తప్పుకాదా? ఈ