70
ఉపన్యాసపయోనిధి.
ము నాత్మయొక్క ఘనతయునై యున్నవి. లోకములో నాత్మయంతటను వ్యాపించియున్నది. హిందువులందున్న యాత్మయును, మహమ్మదీయు లందున్న, యాత్మయుఁ గ్రైస్తవులందున్న యాత్మయునొక్కటియే. జీవకోటియొక్క యనుబంధమునకుఁ గారణ మాత్మయే. కావుననే హిందువుల ధర్మమిట్లుచెప్పుచున్నది.
"శ్లో॥ త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్ధేకులంత్యజేత్ ।
గ్రామంజనపదస్యార్ధే ఆత్మార్థేవృథివీంత్యజేత్ ॥"
"Sacrifice a member for the sake of the family, a family for the sake of a village, a village for the sake of a district, and even the earth for the welfare of the soul."
(కులముయొక్క బాగునకడ్డువచ్చువాఁడొకఁడుండునెడలవానిని కులార్ధమై విడువవలసినది. అట్లేగ్రామమునకొక కులమడ్డువచ్చునెడల దానినిగామార్ధమై త్యజింపవలసినది ఆరీతినేయొకమండలమునకు నొకగ్రామము భంగకరమైనచో నాగ్రామమును ద్రోసివేయవలసినది. ఆతీరుననే యాత్మాభివృద్ధికి భంగమువచ్చునెడల భూమినంతనైనను విడచివేయ వలసినది.) అనియు దీనితాత్పర్యము. ఆత్మ జ్ఞానమును బ్రధానముగాఁ జేసికొని తమధర్మముల నిర్మించుకొనిరి. కావుననే హిందువులు తొల్లితాముమిక్కిలి యున్నత స్థితియందున్న
కాలములోఁ గూడ లోకమంతటను వ్యాపించి తాము వ్యాపించిన తావులనెల్ల పీల్చి పిప్పిచేయలేదు.