హిందూమతము ఒంటెత్తుతనమును గలిగించునదియా.
69
దీనినిబట్టి పాశ్చాత్యుల ఘనధర్మములు నింధ్యములై జాత్యభిమానపురస్కృతములై యున్నవని స్పష్టపడుచున్నదని లాలాగారు తెల్పిరి. పశ్చిమదేశసంఘములు తమలాభమును గోరియే యితరుల కెవ్వరికైన నుపకారము చేయుదురుగాని కేవల పరార్థ పరత్వముతో నెన్నఁడును జేయరు. తమసంఘము బాగుపడుటయే వీరిముఖ్యోద్దేశము. మానవుకుటుంబమునకు (human family) లాభకరము గాక యొక తెగవారికి మాత్రమే లాభకర మగు నుద్యమము చచ్చుటయే మంచిదని హక్సెలెదొరవారు వ్రాయుటకుఁ గారణము పాశ్చాత్యుల కుమార్గములేయనవచ్చు. ఇట్టితంత్రములను ఇట్టిసాంఘికధర్మములను బాశ్చాత్యులనుండి గ్రహించుటకే మన సంఘ సంస్కార ప్రియులు ప్రయత్నము చేయుచున్నారు.
హిందువుల సాంఘికధర్మమిట్టిదికాదు. ప్రస్తుత కాలమున వీరు పాలితజాతి (subject race) గానుండి యుండుటచే సామాన్యబుద్ధులకు వీరిధర్మములు విశాలములుగాఁగాన్సింపక పోయినను బాగుగా విమర్శించి చూచుకొనువారికి హిందూధర్మములందలి ఘనత బోధవడక పోదు. హిందువుల సాంఘిక ధర్మములకు మూలమొకదేశమును నొక జాతియునుగాదు. ఒకసంఘముయొక్క యభివృద్ధియు నొక దేశముయొక్క లాభమును వీరుకోరియుండలేదు. వీరుకోరినది ఆత్మయొక్క యభివృద్ధి. వీరభిలషించినది ఆత్మయొక్కలాభ