హిందూమతము ఒంటెత్తుతనమును గలిగించునదియా.
67
"They would rather build a new social edifice on nationality as distinguished from nationality."
(వీరు జాతిధర్మవిలక్షణమగు యుక్తిధర్మముపై నొకనూత్న సాంఘిక భవనమును గట్టప్రయత్నమును చేయుచున్నారు)
సాంఘికధర్మమూలముంగూర్చి రెండు భిన్నాభిప్రాయములు పాశ్చాత్యులలోఁగలవు (1) స్పెన్సరు మున్నగు పశ్చిమదేశజ్ఞానులు బోధించిన సాంఘికధర్మ మొకటి. ఇది ప్రస్తుతమున్న సంఘముయొక్క యుపయోగమును గూర్చియే ముచ్చటించును. డార్వినుబోధించినపరిణామమతము వేఱొకటి దీనినిబట్టి యిప్పుడున్న సంఘమేకాక యిఁక రాఁబోవువారియొక్క యుపయోగమును గూర్చి యాలోచింప వలసి యుండును. ఈమతమును బొగడుచు మిస్టరు బెంజమెను కిడ్డుదొరవారు (Mr. Banjamin Kind) స్పెన్సరు మతమును నిరసించియున్నారు. దీనినిబట్టి యిప్పుడున్న ప్రజలసంఖ్యనే లెక్కలోనికిఁ దీసికొనక రాఁబోవు ప్రజలసంఖ్యను గూడ లెక్కలోనికిఁ దీసికొని విధులు నేర్పాటు చేసికొనవలెను. అనఁగా మానవజాతినంతను లెక్కలోనికిఁ దీసికొనవలెనను మాట దీనిని మూలముగాఁ బెట్టుకొని లాలాగారు తమవ్యాసమును వ్రాసిరి. ఇంతియేగాక వీరు పశ్చిమదేశసంఘములను గూర్చి యిట్లు వ్రాయించిరి:—