Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూమతము ఒంటెత్తుతనమును గలిగించునదియా.

65

నాధశాస్త్రిగారు కూడ తమమాతృమతమైన హిందూమతమును గూర్చి వింతమాటలాడుటఁ గనఁజాలవింతయేపుట్టుచున్నది. మాకాకినాడపురమున నీనడుమజరిగిన యాంధ్రదేశీయాస్తికసభలో ముచ్చటించుచు శ్రీశాస్త్రిగారు తమముఖోపన్యాసములో హిందూమతముంగూర్చి యిట్లు సెలవిచ్చిరి; —

"It has made the higher religion of India essentially anti-social."

(అది (వైరాగ్యము) యున్నత హిందూమతమును సాంఘికధర్మవిరుద్ధము చేసినది.) అని.

ఇది అసత్యము నసంగతమునునై యున్నది. హిందూమత ధర్మములనుగాని హిందువుల పూర్వచారిత్రములనుగానిబాగుగా నెఱింగిన వారెవ్వరును నిట్లునుడువసాహసింపరు. తెలిసియుఁదెలియని ప్రతిభగలబ్రాహ్మ సామాజికులుమాత్ర మిట్లు చెప్పుచుండుట వాడుకయై యున్నది. ఈయాక్షేపమునకు సమాధానమును విద్వద్వరులగు లాలాలజపతిరాయిగారు ఇదివఱకే యిచ్చియున్నారు. ఈసూరిపుంగవుల వ్యాసముహిందూమతసామాజిక లక్షణము (The social genius of Hinduism) అను శీర్షికక్రింద కాయస్త సమాచారనామక పత్త్రికారాజములో (సంపుటము 10 సంచిక 4) విరాజుల్లుచున్నది. అందుహిందువుల సాంఘికధర్మములను గూర్పిలెస్సగా ముచ్చటింపఁబడియున్నది. అయ్యది 24పుటల పెద్దగ్రం