హిందూమతమును, దానిధర్మములును.
61
కానేరదనియు నీనడుమ హిందూజన సంస్కర్తల మనిపించు కొనఁదలచినవారు కొందఱు స్వమతధర్మములను విడిచి పరమతమని చెప్పందగిన బ్రహ్మసమాజమునఁ బ్రవేశించుటచేఁ దమ పూనికకుఁ జాలభంగమును దెచ్చికొనిరనియు నొక్కి వక్కాణించిరఁట.
అందుపై రావుబహదర్ వీరేశలింగము పంతులవారు లేచి (1) "హిందూ" శబ్దమును మనపూర్వులు వాడియుండలేదనియు దానిని నిందావాక్కుగానుత్తరదేశస్థులు పరిగణింతురనియుఁ బూర్వపు ఋషులు బ్రహ్మమును గొలుచు చుండెడివారు కాన బ్రహ్మసమాజమతమే యీదేశపు మతమనియు (2) కర్మబంధము నంగీకరించునెడల ప్రపంచాది నుండెడివారే కర్మమునుజేయుటచే వారికాజన్మాదులు వచ్చినవను ప్రశ్నవచ్చినఁ దగుసమాధాన ముండనేరదుగాన కర్మవాద మంగీకరింపఁదగినది కాదనియు (3) వేదము లందెచటను బునర్జన్మమునుగూర్చి ముచ్చటింపఁ బడియుండలేదు గాన నదిమనమతమునకు ముఖ్యముకాదనియు నంతియెకాక కర్మబంధమును బునర్జన్మమునుగూడ నంగీకరించుస్థితికి బ్రాహ్మసామాజికులును వచ్చుచున్నారనియు తమసహజాపాత రమణీయోక్తులతో ముచ్చటించిఁరట. కాన, నీవిషయములం గూర్చి చర్చించుట మనకిప్పుడవసరమైనది.