మతముయొక్క యావశ్యకత.
57
ఱుంగని మనము, పాపులీలోకమందుఁ బొందు శిక్షతగినంత లేదని యెట్లుచెప్పఁగలము! కాబట్టి యీ సాహసవాక్యము పంతులవారు మాత్రమేయనఁదగిన దై యున్నది. వారయిననునిది చాలదని యెట్లుచెప్పిరో తెలియకున్నది. తెలియకపోవుటయేమి? తెలియుచునేయున్నది. వారొప్పుకోఁ జాలక పోవుటకుఁ గారణమున్నది. పరముకలదని స్థాపించు భారముమీఁదఁ బెట్టుకొనినవారే పాపులకుఁదగిన శిక్షయిచటనేయగుచున్నదందురేనిఁ బరముగతియేమి? కావున వారట్టనవలసిన దేకానిమనము మాత్రము దానినంధ పరంపరగా నంగీకరింపక మనబుద్ధిని అనుభవమునుఁ బట్టి పరిశీలించి చూచుకొనవలెను. లోకములో నాత్మాయాసముకన్నను, నాత్మానందము కన్నను మించిన కష్టసుఖములు లేవనిపంతులవారే పలుచోట్ల వ్రాసియున్నారు. మనయనుభవమును నట్లనేయున్నది - వానినిఁబట్టి చూడఁగాఁ బై శిక్షయే గొప్పదని తోఁచుచున్నది - అంతకన్న నెక్కుడు శిక్షయైన నది యతిక్రూరమైపోవును - అదియు బంతులవారి యుక్తికి భంగకరణమే. పంతులవారు పునర్జన్మమునుఁగూర్చి వ్రాసిన యుపన్యాసములో మొదటియుక్తిలో దేవుఁడు పరమదయాళుఁడనియుఁ గఠినశిక్షల విధించువాఁడు కాఁడనియుఁ జెప్పఁబడియున్నది కదా - పంతులవారుచెప్పిన యీశ్వరుని కరుణాళుత్వముఁ బట్టి చూచినను, అపరిమిత బుద్ధి సంపదనుఁ బట్టి పరిశీలించినను నింతకన్న నెక్కుడుశిక్ష విధించునని యెవరికినితోఁచదే! పం