మతముయొక్క యావశ్యకత.
55
నుమనస్సున నొకవిధమయిన విచారమును బుట్టించి యంతరాత్మ బాధించుచుండును యావజ్జీవమును నీతివిడువక వర్తించువాఁడొక్కఁడే లోకములో నిక్క మయిన సౌఖ్యమునను భవించును. తక్కినవారందఱును పయికి సుఖపడుచున్న వారివలెఁ గానిపించుచున్నను మనసులోపల నిశ్చలసౌఖ్యమునను భవించువారుమాత్రము కారు.”
అనిసెలవిచ్చియున్నారు మఱియును -
"దుర్మార్గుఁడు పరుల నన్యాయము చేసియు, కల్లలాడియు, హింసించియు సంపాదించిన ధనమును సుఖముగా ననుభవింప నేరఁడు, అతనిమనస్సెప్పుడును దుర్మార్గముగా ధనార్జనము చేసితివని దూషించి బాధించు చుండును, ఆమనోవిచారమును రాత్రులాతనికి నిద్రపట్టనీయదు; నిద్రపట్టునపుడు కలలోసహితము చేసిన నేరములేవచ్చుచుండును; పగలు సహితము నొంటరిగానున్నప్పుడునుతీరిక గలిగియున్నప్పుడును ఆతఁడుతన దుష్కార్యములు తలఁపునఁబాఱివ్యసనముగానుండును;** సన్మార్గుడొకవేళ నీలోకములోదరిద్రుడుగాను అదృష్టహీనుఁడుగాను ఉన్నను, ధర్మ దేవత యాతని మనసున కాపురముండి దుఃఖోపశమనముచేయు చుండును *** సంతోషము తృప్తియును గలుగుచుండును. ”
అని "సాధువర్తన”మను దానియందును బొందుపఱచియున్నారు. కాఁబట్టి యొకవేళఁ గొందఱు పాపాత్ములు సుఖపడుచున్నట్లుగాన్పించినను దీనినిఁబట్టి యది పై కట్లుతో