జీవన్మతమేది
45
(ఇదివఱకు మనమతములోఁ జేరకున్నను మనదేశమందలి విద్యానిధులు స్వేచ్ఛగా మనకు మూలధనము నిచ్చియు మనవార్షికోత్సవాది యుత్సవములకు సాహాయ్య మొసఁగియుఁ జాలతోడగుచుండెడివారు. మఱియు నొకప్పుడు కర్చులలోఁ జాలభాగమువారే వహించుచుండెడివారు. ఆకర్చులన్ననో మనమతబోధకగు కర్చులు; కాని యిప్పుడా సాహాయ్యము చాలతగ్గిపోయినది.)
ఈవ్రాతవలన హిందువులు బ్రహ్మసమాజమతము వ్యాపించుట కభ్యంతర పెట్టక పోవుటయేకాక దాని వ్యాపనమునకు ధనసాహాయ్యమునుగూడ నొసంగెడువారని తేలుచున్నదిగదా. ఇది వీరిసహనబుద్ధిని వేనోళ్ళఁ బ్రకటించు నదిగ లేదా ?
హిందువులనుండి యీరీతిగా మహోపకారము నందుచుండిన బ్రాహ్మ సామాజికులన్ననో యామేలునంతను మరచిపోయి క్రైస్తవులతోఁగలసి హిందువులు తలపెట్టిన ఘనకార్యముల కెల్ల నడ్డువచ్చుచున్నారు. హిందువులు తమలో దాము తమసంఘమును బాగుచేసికొనుటకుఁ బ్రయత్నించుచుండినారన వీరికిఁ గడుపుమంట, వీరు దాని నోర్వఁజాలరు. ఈవాక్యముల నే ననుటలేదు. నాయట్టిసామాన్యు లెవ్వరును నుడువుట లేదు. అరిషడ్వర్గమును జయించి సన్న్యాసియై తనజీవితమునంతను లోకోద్ధరణార్థమై ధారవోసిన వివేకానందస్వామి యీవాక్యములనొక్కి వక్కాణించియు